NTV Telugu Site icon

Maoists Letter: కూనారం భూముల పట్టాలు పంపిణీ చేయండి.. మావోయిస్టులు లేఖ కలకలం..

Peddapalli Maoist

Peddapalli Maoist

Maoists Letter: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం భూములపై మావోయిస్టులు లేఖ విడుదల కలంకలం రేపుతుంది. 600 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు చేసి ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ విలేఖరి కట్ట నరేంద్ర చారి, పలువురు రియాల్టర్ల పై హెచ్చరికలు జారీ చేశారు. ఆక్రమించిన భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read also: Hanuman Chalisa: లోక్‌సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు

లేఖలో ఏముందంటే..

పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండలం, కువారం గ్రామంలో 1200 ఎకరాల పరంబోకు భూములు ఉన్నాయి. దాదాపు 600 ఎకరాల భూములను పేద, మధ్యతరగతి ప్రజలు చాలా కాలం నుండి ఒక ఎకరం, రెండు ఎకరాలు దున్నుకుంటున్నారు. ఆ భూములను వాళ్లే దున్నుకోవాలని అన్నారు. మిగిలిన 600 ఎకరాల భూమిని భూస్వాములు దండ నర్సింహారెడ్డి 200 ఎకరాలు, గీట్ల రాజేందర్ రెడ్డి 60 ఎకరాలు, గిట్ల నిర్మల 60 ఎకరాలు, గొర్ల సుదర్శన్ 30 ఎకరాలు, మిగిలిన భూములను పలుకుబడి ఉన్న పెద్దలు ఆక్రమించారని మండిపడ్డారు. ఈ భూములను ఎల్ రాజయ్య కు 30 ఎకరాలు, శ్రీనివాస్ కు 30 ఎకరాలు అమ్మినారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల కోసం ప్రజా సంఘాల నాయకత్వంలో పోరాడినప్పుడు వారిపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆ భూములను 200 మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం జి.వో ఇచ్చిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కలిసి ఆ భూములను ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు మొఖం చాటని భూములను ఆక్రమించిన భూస్వాముల పక్షాన్నే ఉన్నారని తెలిపారు.

Read also: Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?

భూములను ఆక్రమించిన భూస్వాములు, పెత్తందార్లు ఆ భూములను సాగు చేయడం బందు పెట్టాలని.. లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము. పోరాడి ఆక్రమించిన భూములకు పట్టాలు చేయిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజలు ఎవరు క్షమించరని అన్నారు. పెద్దపల్లి మాజీ విలేకరి కట్ల నరేంద్రాచారి, కంది చొక్కా రెడ్డి పెద్దపల్లి పట్టణంలో, దాని చుట్టు పక్కల ఉన్న వివాదాస్పద భూములను అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో కొనుగోలు చేసినట్లు దొంగ పట్టాలు చేయించి, అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ముస్లిం -వ్యక్తిభూమిని కొనుగోలు చేశానని నమ్మించి ప్లాట్లుగా పెట్టి అమ్మినారు తీరా ఆ భూమిలో ఇల్లు కట్టుకుందామని పోగానే పట్టాదారు వచ్చి ఈ భూములు మావేనని అనడంతో వాళ్లంతా నష్టపోయారని తెలిపారు. బొంపల్లి, కాసులు పల్లె గౌరెడ్డిపేటలో ఉన్న దేవాదాయ భూములను దొంగ పట్టాలు చేసుకుని అక్రమంగా మింగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి అమ్మి వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కొనుగోలు చేసిన భూములకు తిరిగి డబ్బులు చెల్లించాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని లేఖలో పేర్కొన్నారు.
మెడ మీద నలుపు ఎంతకీ పోవట్లేదా? ఇలా చేయండి