Manchryala Maoist letter: మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార అండతో వసూళ్లకు పాల్పడుతున్న బొగ్గు గని కార్మిక సంఘాలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల కావడం సంచళనంగా మారింది. ఒక వైపు మావోయిస్టులే లేవని పోలీసులు చెబుతుంటే.. ఉన్నట్టుండి సింగరేణి ప్రాంతంలో లేఖలు విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంసకంగా మారింది.
Read also: T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి రీజియన్ పరిధిలో మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమైక్య పేరుతో లేఖ విడుదల కావడం కలకలం రేపుతుంది. కోల్డ్ వెల్ట్ ఏరియాలో తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యేలు వారి అనుచరులపై వార్నింగ్ లేఖలు విడుదలైన కొద్దిరోజులు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. తాజాగా మరో లేఖ విడుదలైంది.
అందులో గోలేటి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలోని టి.పి.జి.కె.ఎస్ నేతలు వసూళ్ల పర్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఓట్లు వేసి గుర్తింపు ఇస్తే.. జీయం స్థాయి అధికారులతో కుమ్మక్కై ఏరియా నాయకులతో పాటు పిట్ సెక్రెటరీ వరకు వివిధ రూపాలలో కార్మికుల వద్ద క్యాష్ వసూళ్లు చేస్తున్నారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. బెల్లంపల్లి రీజియన్ లోని కొంతమంది టి.పి.జి.కె.ఎస్, ఎటీయూసీ నాయకులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. లేదంటే శిక్షతప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై పోలీసులు నోరు మొదపడం లేదు. ఇప్పటివరకు మవోలు లేవు, కార్యకలాపాలు లేవు అంటూ చెప్పుకుంటూ వచ్చిన పోలీసులు. ఈలేఖలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోతున్నారు. కేవలం అధికారపార్టీ, దాని అనుబంద సంఘం నేతలపై తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Husband Attack on Wife: భార్యపై కత్తితో దాడి.. రాయచోటిలో భర్త దారుణం