మావోయిస్టు టాప్ లీడర్ ఆర్కే.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని ఆ పార్టీ నేత అభయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు మావోయిస్టులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు.. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్టు చెబుతున్న మావోయిస్టు నేతలు.. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు.. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టుగా చెబుతున్నారు. ఆర్కే అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మావోయిస్టులు.. పార్టీ లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు కూడా భారీగా తరలివచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆర్కే అంత్యక్రియలు పూర్తి..
