Site icon NTV Telugu

Pulluri Prasad Rao : మా సిద్ధాంతం ఓడిపోలేదు.. ఓడించడం ఎవరితరం కాదు

Pulluri Prasad Rao

Pulluri Prasad Rao

తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టు కీలక నేత ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న లొంగిపోయారు. ఆయన తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. అయితే.. మావోయిస్టు లొంగుబాటులో తెలంగాణ SIB కీలక ఆపరేషన్‌ నిర్వహించింది. పార్టీ ఐడిలయాలజీ ని నిర్మించిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలువడానికి పుల్లూరు ప్రసాదరావు, బండి ప్రకాష్ లు లొంగిపోయారని తెలిపారు.

Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు

ఆరోగ్యకరమైన సమస్యలు, మోకాళ్ళ నొప్పులతో పాటు మరికొన్ని కారణాలు చేత ప్రసాద్‌రావు లొంగిపోయాడని ఆయన వెల్లడించారు. 17 ఏళ్ళ పాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ప్రసాదరావు పై 25 లక్షలు రివార్డు, బండి ప్రకాష్ పై 20 లక్షల రూపాయలు రివార్డులు వారిద్దరికి అందజేస్తామని తెలిపారు. ఈ ఏడాది 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించచారు. ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మాట్లాడుతూ.. మాది లొంగుబాటు కాదు అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి వచ్చామన్నారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాను, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తానని, మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని ఆయన తెలిపారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి అలియాస్ దేవ్ జీ ఎన్నుకున్నారని, దేవ్‌జిని సపోర్ట్ చేస్తున్నానని, ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చానని ఆయన వెల్లడించారు. మావోయిస్టులు మా అన్నదమ్ములని సీఎం రేవంత్ పిలుపునివ్వడంతో ముందుకు వచ్చామని, జనంలో ఉంటూ జనం కోసం పని చేస్తామన్నారు.

Raviteja: యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సెట్?

Exit mobile version