ఈ మధ్య మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి… పెద్ద సంఖ్యల్లో మావోయిస్టులు లొంగిపోతున్నారు.. మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారినపడినట్టు ప్రచారం జరిగింది. కొంతమంది ఆస్పత్రిల్లో చేరి కూడా పోలీసులకు చిక్కారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్ భార్య శారద లొంగిపోయారు.. గత కొంత కాలం నుంచి పార్టీకి హరి భూషణ్ కుటుంబం దూరంగా ఉంటోంది… కొన్ని రోజుల క్రితమే హరి భూషణ్ కుమారుడు లొంగిపోగా.. తాజాగా, ఖమ్మం పోలీసుల ముందు హరిభూషణ్ భార్య శారద లొంగిపోయారు.. పార్టీలో హరి భూషణ్ కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుండగా.. హరి భూషణ్ భార్య శారద లొంగుబాటుపై ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారిక ప్రకటనచేయనున్నారు.. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దివంగత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ భార్యే ఈ శారద అలియాస్ శారదక్క. మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా కమిటీ మెంబర్‌గా, డీసీఎం కమిటీ మెంబర్‌గా ఆమె కొనసాగుతున్నారు.. ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం.. ఇక, మావోయిస్టుల వరుస లొంగుబాట్లు.. పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి.
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. లొంగిపోయిన అగ్రనేత భార్య..
