Manipur: మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో తెలంగాణ విద్యార్థులు, అక్కడి ప్రజల భద్రతకు తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితులను పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల తరలింపుకు తెలంగాణ ప్రభుత్వం రెండు స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాదుకు రెండు స్పెషల్ ఫ్లైట్స్ ఇంపాల్ నుంచి రానున్నాయాని తెలిపింది. ఒక ఫ్లైట్ బేగంపేట ఏర్పోర్ట్ మరొక ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ కానున్నట్లు వెల్లడించింది.
Read also: PM Modi: బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని మెగా రోడ్ షో..
తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పౌరులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ ఇన్‌ఛార్జ్‌గా డీఐజీ బి.సుమతిని నియమించినట్లు డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్ 7901643283కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని లేదా సహాయం కోరవచ్చని ఆయన సూచించారు.
PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..