NTV Telugu Site icon

Manikrao Thakre: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం

Manikrao Thakare

Manikrao Thakare

Manikrao Thakre Comments On KTR Meeting With Central Ministers: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. లోపాయికారి ఒప్పందంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన అనంతరం థాక్రే మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీల మధ్యనున్న లోపాయికారి ఒప్పందం నేపథ్యంలోనే మంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే.. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. కేసీఒర్ మహారాష్ట్రలో ఒక్క సీటు గెలిచినా.. తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇక్కడేమో బీజేపీతో వైరం ఉందని అంటున్న కేటీఆర్.. ఢిల్లీలో మాత్రం కేంద్రమంత్రులతో, అమిత్ షాతో కలుస్తున్నారని పేర్కొన్నారు.

Anil Kumar Eravathri: ఆ అర్హత లేదంటూ.. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మాజీ విప్ ఈరవత్రి ఫైర్

అంతకుముందు శుక్రవారం నాడు కూడా.. బీజేపీ అగ్రనేతల్ని బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారని, ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోందని మాణిక్‌రావు వ్యాఖ్యానించారు. కూటమి ఏర్పాటు కోసం ఆ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ సమస్యలపైనే తాము బీజేపీ నేతల్ని కలుస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకే.. బీఆర్ఎస్ నేతలు వారిని ఆ పార్టీ నేతలో కలుస్తున్నారని చెప్పారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరుగుతోందని, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నమ్మకం వెలిబుచ్చారు.

IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని.. ఆ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు- వసీం జాఫర్