Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు
- మణికొండలో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
- భయంతో బయటకు పరుగులు తీసిన వాసులు
- ఫైర్ సిబ్బంది సమయానికి మంటల నియంత్రణ
- షార్ట్ సర్క్యూట్ అనుమానం.. దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని రోడ్ నెంబర్ 25లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో అపార్ట్‌మెంట్ వాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా అప్రమత్తమై వెంటనే భవనాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో, అగ్నికీలలు ఇతర ఫ్లాట్‌లకు వ్యాపించకుండా నివారించగలిగారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇంట్లోని విద్యుత్ ఉపకరణాల్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ , ఫైర్ అధికారులు నమూనాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు , యజమానులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
CM Chandrababu : టీడీపీ గెలుపే రాష్ట్రం గెలుపు.. 44వ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!