Manickam Tagore: కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు. ఠాగూర్ వారం వ్యవధిలో రెండుసార్లు హైదరాబాద్‌కు వస్తారు. వారం తర్వాత పూర్తిగా తెలంగాణలో మాకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర ముగిసే వరకు ఆయన రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ పనితీరును పరిశీలించేందుకు మాణిక్కం ఠాగూర్ స్వయంగా మునుగోడులో పర్యటించనున్నారు.
read also: Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ కంచికి.. ‘కో ఆపరేటివ్’గా లేదని లైసెన్స్ రద్దు
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు, సభలతో ప్రదర్శిస్తుంటే, మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. నెలరోజులు మకాం వేసి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు వ్యూహం, చర్చా సమావేశాలు జరపనున్నారు.
Hanuman Chalisa Bhakthi Tv Live: హనుమాన్ చాలీసా వింటే మీ కష్టాలు తొలగి..