Site icon NTV Telugu

నేడు కాంగ్రెస్‌ కీలక భేటీ.. హుజూరాబాద్‌ అభ్యర్థి ఖరారు..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే, అదే ఒరవడి కొనసాగింపుగా టి.పీపీసీ ప్రయత్నాలు చేస్తోంది.. ఇక, హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మణికం ఠాగూర్.. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు… ఈ సమావేశంలో ముఖ్యంగా గజ్వేల్ సభ, హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇప్పటికే పలు పేర్లను హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బరిలో దింపేందుకు పరిశీలించిన పీసీసీ.. ఫైనల్‌గా మాజీ మంత్రి, సీనియర్‌ నేత కొండా సురేఖ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.. గాంధీ భవన్‌ వేదికగా ఇవాళ జరిగే సమావేశంలో హుజురాబాద్‌ అభ్యర్ధి ఎంపిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Exit mobile version