NTV Telugu Site icon

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే…

manickam-tagore

manickam-tagore

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… బీజేపీ,టీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో దోస్తీ ఉంది అని తెలిపారు. ఢిల్లీలో దోస్తీ గల్లీ లో కుస్తీ పడతాయి. అవినీతి అక్రమాలు అంటున్న బీజేపీ లిఖిత పూర్వకంగా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు. బండి సంజయ్ అమిత్ షా కు, ఈడీ కి ఫిర్యాదు చేయాలి. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఎంపీ పై చేస్తున్న ఫిర్యాదులు తెలంగాణలో ఎందుకు చేయడం లేదు. 2023 నాటికి కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పని చేయాలి. 70 సీట్లు సాదించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి అని ఆయన పేర్కొన్నారు.