NTV Telugu Site icon

Manickam Tagore : కాంగ్రెస్‌లో నాటకాలు, డ్రామాలు కుదరవు

manickam-tagore

manickam-tagore

కాంగ్రెస్ లో నాటకాలు, డ్రామాలు కుదరవు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలు సరిగా ఉన్నా, నేతల మద్య సమన్వయం లేదన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, కేసీఆర్‌ తెలంగాణలో లూటీ ముగియడంతో … బంగారు భారతదేశం అంటూ దేశంలో లూటీకి కోసం వస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటు పై బీజేపి డ్రామాలాడుతోందని, పార్లమెంట్‌కు తాళం వేసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని బీజేపీ తెలంగాణ ప్రజలను కించపరిచిందని ఆయన ఆరోపించారు. 78 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తామని, ఉత్తర తెలంగాణలో అధిక సీట్లను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రజలతో అనుబంధం ఉన్న పార్టీ అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మకై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు.