NTV Telugu Site icon

20 నెలలు మనకు సవాల్.. 72 సీట్లు టార్గెట్..!

Manickam Tagore

Manickam Tagore

20 నెలలు మనకు సవాల్… మన టార్గెట్‌ 72 సీట్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మణికమ్ ఠాగూర్.. యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.. యూత్ కాంగ్రెస్ నుండి నాయకులుగా ఎదిగిన వాళ్లే ఎక్కువగా పార్టీలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు.. ఏఐసీసీ కార్యదర్శులు కూడా అయ్యారన్నారు.. వచ్చే 20 నెలలు కష్టపడి పని చేయండి.. ఈ 20 నెలలు మనకు సవాల్‌ లాంటిదన్న ఆయన.. 72 సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్… వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పని చేయండి అవకాశాలు వస్తాయని స్పష్టం చేసిన ఠాగూర్.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం.. కాంగ్రెస్‌ పార్టీని వచ్చే 20 నెలల్లో అధికారంలోకి తెద్దాం అన్నారు.