Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సానుకలుమని ప్రకటిస్తున్న పార్టీలు తమ బాధ్యత నిర్వర్తించే క్రమంలో చేతులెత్తుస్తున్నారని తెలిపారు. దానివల్లనే 29 ఏళ్లుగా పోరాటం జరుగుతూనే ఉందన్నారు. నరేంద్ర మోడీ కూడా వర్గీకరణకు అనుకూలమని స్వయంగా నాతోనే అన్నారని.. దానికి కిషన్ రెడ్డి నే సాక్ష్యమని మందకృష్ణ అన్నారు. అమిత్ షా కూడా అనూకూలం అనే అన్నాడన్నారు. అది నిజమే అయితే వెంటనే బహిరంగంగా ప్రకటించాలి అది కూడా ఎన్నికలలోపే అన్నారు. ఇద్దరు ఒక అంశం ఎంచుకున్న ఏ చట్టం ఆగలేదన్నారు. పార్లమెంట్ లో ఎపుడూ బిల్ పెడతారో చెప్పాలన్నారు. Sc వర్గీకరణ కు అనుకూలమని YS హయాంలోనే హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టో లో కూడా పెట్టారని తెలిపారు. కమిషన్ వేసింది,అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కూడా పోరాటం చేయట్లేదని తెలిపారు. సోనియా గాంధీ కూడా పార్టీ అధ్యక్షురాలు హోదాలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఖర్గే కూడా చేవెళ్లలో సభలో డిక్లరేషన్ లో పొందుపరిచారని తెలిపారు. వర్గీకరణ హామీ అనేది పేపర్ల పై ఉంటుంది కానీ,దానిని వాస్తవరూపం దాల్చలేదన్నారు.
కర్ణాటకకు చెందిన ఖర్గే మాల సామాజిక వర్గానికి చెందిన నాయకుడై కూడా హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నించారు. వర్గీకరణపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు. మోడీ కు బహిరంగ లేఖ రాయాలని తెలిపారు. తెలంగాణలో బలమైన శక్తి మాదిగ సమాజమన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలోనే మీ స్టాండ్ ప్రకటించాలని తెలిపారు. BRS వర్గీకరణకు అనుకూలమని బిల్ పాస్ చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. KCR చొరవ తీసుకోవడం మర్చిపోయారని మండిపడ్డారు. అఖిల పక్షంను ఢిల్లీకి తీసుకెళ్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. 2017 నవంబర్ 6న రెండు రోజుల్లో మోడీని కలుస్తా అన్నారని తెలిపారు. కానీ కూతురు కవిత మాత్రం జైల్ కు పోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న కూతురు మీద ఉన్న ప్రేమ ఓ జాతి మీద లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపో మాపో జైల్ కు కవిత అన్న వార్తలు వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కవిత ఎందుకు పోలేదు? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మీరు తలచుకుంటే ఏ చట్టమైనా ఆగిపోతున్నాయని తెలిపారు. చట్ట రూపం పొందుతున్నాయని అన్నారు. Sc రిజర్వేషన్ స్థానాలు 19 ఉన్నాయని, 74,75 శాతం మా మాదిగ జనాభా ఉన్నారని.. దాని ప్రకారం టికెట్లు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో 40 వేలకు మించి మాధిగలున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మధిర, సత్తుపల్లి లో మాల సోదరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆ రెండు ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందని తెలిపారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని నమ్మిన మాధిగలున్నారు అందులో ఒకాయన కొండ్రు సుధాకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం వదిలి వచ్చాడు కదా…. అడ్డుకునేది రేణుక చౌదరి,మల్లు భట్టి విక్రమార్క నే అన్నారు. పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని మండిపడ్డారు. ఎవరి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట వాళ్ళు పోటీలోకి దిగారన్నారు. మరి మాకు ఆ న్యాయం వద్దా? అని ప్రశ్నించారు. 19 స్థానాల్లో మాకు రావాల్సిన స్థానాల్లో కూడా రేవంత్ రెడ్డి మాల లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. మాదిగలకు ఏ పార్టీలో కూడా గాడ్ ఫాథర్ లేదు కనుకనే.. టికెట్లు రావడం లేదన్నారు. వాళ్లకు రాష్ట్రంలో భట్టి ఉన్నాడు, కేంద్రం లో ఖర్గే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 50,60 వేల మంది చొప్పదండిలో ఉంటే కేవలం 6 వేల మంది ఉన్న మాల సోదరుడికి ఇచ్చారని తెలిపారు. బెల్లం పల్లి లో వివేక్ వాళ్ళ అన్న వినోద్ కు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లాల ఓదెలు కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వర్ధన్న పేటలో నాగరాజు అనే పోలీసు అధికారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని, చెన్నూర్ కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు.
Vivo Y200: మార్కెట్లోకి వివో నుంచి మరో కొత్త ఫోన్.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్..