Vivo Y200: మార్కెట్లోకి వివో నుంచి మరో కొత్త ఫోన్.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండగ సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ సంస్థలు ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్ చేశాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి..
ఈ నేపథ్యంలో తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై200 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వివో ఈ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై 200 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో అందించింది. 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్‌ను అందించారు.. ధర కూడా తక్కువే.. మరి ఆ ఫీచర్స్ ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. జంగల్ గ్రీన్ డిసర్ట్ గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్ సైతం లభిస్తోంది. ఎస్‌బీఐ తో పాటు మరికొన్ని ప్రముఖ బ్యాంకులు ఆఫర్స్ ను అందిస్తున్నారు.. ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 1,080×2,400 పిక్సెల్స్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీస్ సొంతం. ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు.. 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. నైట్‌మోడ్, పనోరమో, టైమ్ లైప్స్ వీడియో, డ్యూయల్ వ్యూ పొర్ట్‌రేట్, స్లో మోషన్ ఫీచర్స్ ను కూడా కెమెరా అందిస్తుంది.. యూఎస్‌బీ 2.0 కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.. ఈ ఫోన్ బరువు 190 గ్రాములు ఉంటుంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..