Site icon NTV Telugu

Manda Krishna Madiga : ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకం

Manda Krishna Madiga Made Comments On CM KCR.

రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి అని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, నా ఇష్టం ఉన్నోళ్లకు పనిచేస్తా అని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ ఏడున్నర ఏండ్ల పాలనలో చేసింది శూన్యమన్నారు.

ప్రపంచమంతా గౌరవించే అంబేద్కర్ అంటే సీఎం కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం చాలా గొప్పదని, మేధావులకే మేధావి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అబద్ధాల పునాదులపై ఏమి నిర్మించలేమని, అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలం.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉండాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంబేద్కర్ కు గౌరవించారని, సీఎం కేసీఆర్ సీఎం అయింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అనే విషయాన్ని మర్చిపోయారని ఆయన మండిపడ్డారు.

https://ntvtelugu.com/prof-kodandaram-made-comments-on-cm-kcr/
Exit mobile version