Site icon NTV Telugu

Mandakrishna Madiga : మాదిగ జాతిని నట్టేట ముంచింది

Manda Krishna Madiga

Manda Krishna Madiga

బీజేపీ వర్గీకరణ విషయంలో కోటలు దాటగానే వర్గీకరణ అమలు చేసే విషయంలో ఒక అడుగు కూడా ముందడుగు వేయలేకుండా మాదిగ జాతిని నట్టేట ముంచిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇప్పుడు అదే పెద్దలు ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ ఇప్పుడు జరగబోయే పబ్లిక్ మీటింగ్‌లో తెలంగాణ ప్రజలకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పబోయే మాటలు మాట్లాడబోతున్నాడని, ఆయన మాటలు కూడా నీటి మీద రాతలే తప్ప ఆయన ఇచ్చిన హామీలు అమలు జరగవు అనే విషయం తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైందని విషయం కూడా గుర్తు చేస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టవచ్చు అని అయితే అనుకుంటారేమోగాని పూలు పెట్టించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరన్న విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దల మాటలే కాదు నరేంద్ర మోడీ మాటలకు విలువ ఉండదని, ఆ మాటలకు తనే విలువనివ్వడని స్పష్టంగా మా షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలోనే తేలిపోయిందన్నారు.

అందుకు రెండు ప్రధాన సాక్షాలు ఒకటి 2014 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో అపాయింట్మెంట్ కోరకుండానే బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి మమ్ములను తీసుకెళ్లి గౌరవ నరేంద్ర మోడీని కలిపి షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద మాతో వినతిపత్రం ఇప్పించారన్నారు. ఆయన అన్న మాట ఒకటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అనేది కచ్చితంగా జరగాలి.. అందుకోసం మీరు ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తుండ్రు మిమ్ములను అభినందిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీజేపీ నాయకత్వంలో కేంద్రం మొత్తం అధికారం వస్తుంది కచ్చితంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి మీ ఆకాంక్షలను నిలబెడతారని చెప్పారన్నారు. రెండో సందర్భం 28 నవంబర్ 2016న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో నిర్దిష్టమైన హామీ ఇచ్చారని ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. బీజేపీని, నరేంద్ర మోడీని మాదిగ జాతి క్షమించదని ఆయన మండిపడ్డారు.

 

Exit mobile version