Site icon NTV Telugu

Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..

Chennor

Chennor

Poker Game In Excise PS: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట ఆడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్‌ను పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లు కలిసి పేకాట క్లబ్బుగా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. పేకాట ఆడుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్సైజ్ స్టేషన్‌ను మూసివేసి, లోపల వీళ్లు పేకాట ఆడుతున్నట్టు ఆ వీడియోల్లో క్లియర్ గా కనిపిస్తుంది.

Read Also: Shocking Video: పామునే ముప్పు తిప్పలు పెట్టించిన ఓ కీటకం

అయితే, ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్/ఎక్సైజ్ స్టేషన్లను ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డగా మార్చడంపై ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తయిన అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మిగిలిన ఐదుగురు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.

Exit mobile version