NTV Telugu Site icon

Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ

Harassment

Harassment

Harassment: మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. నిన్న (మంగళవారం) మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన జ్యోతి మున్సిపల్ కమిషనర్ భార్య కావడం మరో సంచలనానికి దారిస్తోంది. ఆమె మృతిపై పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు కారణం భర్త బాలకృష్ణ, అతని కుటుంబ సభ్యుల వేధింపులేనని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే జ్యోతి తన తల్లిదండ్రులైన గంగవరపు రవీంద్ర కుమారి, రాంబాబులకు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేసింది. జ్యోతిని తన భర్త తనను చంపేసేలా ఉన్నాడని ఏడుస్తూ చెప్పినట్లు వారు చెబుతున్నారు. అయితే.. భర్త మున్సిపల్ కమిషనర్ గా ఎన్నికైన తర్వాత నుంచి తనపై వేధింపులు ఎక్కువ చేశాడని, కుటుంబ సభ్యులు అతనికి తోడయ్యారని తెలిపారు. అంతేకాకుండా.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం వచ్చేదని.. అందమైన భార్య దొరికేదని పదేపదే మాటలతో హింసించేవాడని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ బయటికి చూడడానికి చాలా మంచివాడిగా కనిపించే బాలకృష్ణ ఇంట్లో సైకోలాగా శాడిస్టులాగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఇక మంచిర్యాల సీఐ నారాయణ నాయక్ ఈ మేరకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఇది ఇలా వుండగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం తాము బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయబోమని, ముందు అతనిని తమకు అప్పగించాలని గొడవకు దిగారు. కాగా.. బాలకృష్ణ మీద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అప్పుడు కాని జ్యోతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈనేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జ్యోతితో పాటు బాలకృష్ణ సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అంతేకాకుండా.. వారి ఇంటి చుట్టుపక్కల వారిని, ఇంటి పనిమనిషిని విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు.

Read also: Horrible incident: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..

అయితే.. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న బాలకృష్ణ స్వగ్రామం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం. తన భార్య జ్యోతి స్వస్థలం కొనిజర్ల మండలం సీతారామపురం. వీరిద్దరికి 2014, ఆగస్టు 14న వీరికి వివాహమయ్యింది. ఇక బాలకృష్ణ పెళ్లైన సమయంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేశాడు. అయితే.. కానిస్టేబుల్ గా హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో 2020లో గ్రూప్ టూ ద్వారా మున్సిపల్ కమిషనర్ గా ఎంపిక అయ్యాడు. దీంతో.. నిర్మల్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఏడాదిన్నర క్రితం మంచిర్యాలకు బదిలీ అయ్యాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ నిన్న (మంగళవారం) స్కూలుకు వెళ్లిన తర్వాత జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. అయితే.. స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో షాక్‌ కి గురయ్యారు. ఉదయం వెళుతున్నప్పుడు ఆనందంగా పంపిన తల్లి ఇంటికి వచ్చేసరికి శవమై కనిపించడంతో చిన్ని హృదయాలు తట్టుకోలేక పోయారు. అమ్మా లే.. అంటూ ఏడుస్తున్న చిన్నారులను ఓదార్చడానికి ఎవరితరం కాలేదు. దీంతో జ్యోతి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Revanth Reddy: ప్రగతిభవన్‌పై రేవంత్‌ కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ నేతలు సీరియస్‌