Musapet Metro Station: మెట్రోరైలు ముందు దూకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musapet Metro Station: ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా మెట్రో స్టేషన్లు ఆత్మహత్యకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల వరుసగా మెట్రో స్టేషన్లలో ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మళ్లీ ఇవాళ మూసాపేట మెట్రో స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల రోజుల్లో మెట్రో స్టేషన్లలో ఇది మూడో ఘటన. ఇక.. తాజాగా హైదరాబాద్ మూసాపేట మెట్రో స్టేషన్లో జరిగిన ఘటనలో గురువారం డిసెంబరు 6 రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో టికెట్ తీసుకోకుండా స్టేషన్లోకి ప్రవేశించిన ఆవ్యక్తి ట్రాక్‌పైకి చేరుకుని రైలు రాగానే దూకాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆవీడియోని బట్టి చూస్తే అతని శరీరం ముక్కలు ముక్కలు అయినట్లుగా కనిపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read also: Winter Yoga: చలికాలంలో ఈ యోగాసనాలు వేస్తే శరీరానికి మంచిది
Also Read
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి జనవరి 4న బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొందరు స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం నాగోల్‌లో కూడా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతిరోజూ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు నమోదౌతున్నాయి. ఇక, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ప్రతి రోజూ వందలాది మంది రద్దీ వున్న ప్రదేశంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు కోరుతున్నారు.
Heart Attack: విమానం గాల్లో ఉండగా 2 సార్లు గుండెపోటు.. ప్రాణాలు రక్షించిన భారత వైద్యుడు
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!