NTV Telugu Site icon

Gun Firing in Rangareddy: రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. కారులో వచ్చి..

Gun Firing In Rangareddy

Gun Firing In Rangareddy

ఓ లారీ డ్రైవ‌ర్ పై కారులో వ‌చ్చిన డుండ‌గులు కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై కల‌క‌లం రేపింది. శ‌నివారం (నిన్న) రాత్రి లారీని వెంబడిస్తూ వచ్చిన ఓ వ్యక్తి తుక్కుగూడ ఎగ్జిట్ 14 వ‌ద్ద రాగానే సడెన్ గా లారీడ్రైవర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే.. గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తుపాకీ కాల్చ‌డంతో.. లారీ అద్దాలు పగిలిపోయాయి. అప్ర‌మ‌త్త‌మైన లారీ డ్రైవర్ మనోజ్ వెంట‌నే 100కు కాల్ చేసి పోలీసులకు స‌మాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభిచారు. కాగా.. ఈ లారీలో ఐరన్ లోడ్ తో మెదక్ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరినట్లు బాధితుడు మ‌నోజ్‌ కంప్లైంట్ తెలిపాడు. ఈనేప‌థ్యంలో.. కాల్పుల ఘటన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. దుండగులు కాల్పుల అనంతరం నిందితుడు వరంగల్ వైపు వెళ్లి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే .. గతంలోకూడా ఔటర్ రింగ్ రోడ్డు పై తమిళనాడు, మధ్యప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్ లకు చెందిన దోపిడీ దొంగలు హల్ చల్ చేసిన‌విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో.. విలువైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా దోపిడీ దొంగ‌లు టార్గ్‌ట్ చేస్తున్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. లాడీ డ్రైవర్లను బెదిరించటం.. లేదంటే హతమార్చటం చేస్తున్నారు. అయితే.. గ‌త కొద్దిరోజుల క్రితం లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Elon Musk: ట్విట్టర్ సీఈఓకు ఎలాన్ మస్క్ బెదిరింపులు