Mallu Ravi Challenges BRS Govt On Dharani Portal Issue: ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్చించేందుకు సిద్ధమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన పోడు భూములు, మాన్యం భూములు, అసైన్డ్ భూములు.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో కనిపించకుండా చేశారని ఆరోపించారు. రైతుల పట్టా భూములు మొత్తానికి మొత్తం ధరణిలో ఎక్కలేదన్నారు. రైతుకు ఏడెకరాల భూమి ఉంటే.. కేవలం ఐదు ఎకరాలు మాత్రమే ధరణిలో ఎక్కించి, రెండు ఎకరాలు వదిలేశారని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు ఎలాంటి సమాధానం దొరకడం లేదన్నారు.
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి.. ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడితే, ధరణితో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలు తీరుతాయా? అని మల్లురవి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న సంకేతాలు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు ఇస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ దాన్ని జీర్ణించుకోలేక, కాంగ్రెస్‌ను తిట్టడమే ఎజెండగా పెట్టుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ సభకు వచ్చిన సీఎం కేసీఆర్.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు బీమా కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తానని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి, పాలమూరు జిల్లా ప్రజలపై ప్రేమ లేకపోవడమే అందుకు కారణమని దుయ్యబట్టారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
V Hanumantha Rao: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది
ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షులు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నియోజకవర్గంలో 6 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు నిరూపిస్తే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తాను తప్పకుంటానని ఛాలెంజ్ చేశారు. ‘అచ్చంపేట గడ్డా బాలరాజు అడ్డా అడ్డుకునేది ఎవరంటూ’ విర్రవీగుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజును.. ఆరు నెలల తర్వాత నియోజకవర్గ ప్రజలు ఎస్ఎల్బీసీ కాలువలో పడేస్తారని వ్యాఖ్యానించారు. జానెడు కాల్వ, తట్టెడు మట్టి తీయకుండా తొమ్మిదేళ్లుగా ఏం చేస్తున్నావ్? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గువ్వల బాలరాజు సానుభూతి డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. తనని చంపడానికి నాలుగు టీములు తిరుగుతున్నాయని మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్న ఆయన.. ప్రభుత్వం మీదే కదా? పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయని నిలదీశారు.