NTV Telugu Site icon

Telangana Budget 2024: త్వరలో రైతు రుణమాఫీ.. వారికి రైతు బంధు కట్..

Budget Batti

Budget Batti

Telangana Budget 2024: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాపీపై కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని తెలిపారు. అంతే కాకుండా.. అర్హులకే రైతు బంధు ఇస్తామని, రైతు బంధు నిబంధనలు పున:సమీక్ష చేస్తామన్నారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని వెల్లడించారు. . రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారని తెలిపారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు. అలాంటి వారందరికి రైతు బంధు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Read also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

ఇక తెలంగాణలో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ. 1000 కోట్లు.. ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3.500 ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు. జ్యాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తున్నామని, త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలు వెల్లడించనున్నాట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని, త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం అన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయమన్నారు.

Read also: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ హైలెట్స్ ఇవే..

రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నాం.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని తెలిపారు. టీఎస్పీఎస్సీకి రూ. 40 కోట్లు.. త్వరలో మెగా డీఎస్సీ ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది.. నకిలీ విత్తనాలతో మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
Karumuri Nageswara Rao: మాట ఇస్తే నిలబడే వ్యక్తి జగన్.. కుటుంబంలో అందరికీ మంచి చేసే వ్యక్తి..

Show comments