తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. 32 సంవత్సరాల ఘన చరిత్ర, నిపుణత కలిగి, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన 32 విద్యా సంస్థలను నిర్వహిస్తూ వచ్చిన మల్లారెడ్డి యూనివర్సిటీ, విద్యా వ్యవస్థపై చెరగని ముద్ర వేసింది.
ఈ మొట్ట మొదటి ‘‘హరిత క్షేత్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయం’’ సరికొత్త స్పెషలైజేన్స్ లలో ప్రోగ్రామ్స్ ని అందిస్తోంది. అసాధారణమైన ప్రతిభను పెంపొందించే విద్యా వేదికగా, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అగ్రగామిగా నిలిచింది. సమాజం సకారాత్మక ప్రగతి సాధించాలంటే అందుకు నాణ్యమైన విద్యను అందించడమే కీలకమని మనసా, వాచా, కర్మణా నమ్మిన దార్శనికులు శ్రీ మల్లారెడ్డి గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.మొదటి విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తయిన తరువాత, 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్ మెంట్ అండ్ పబ్లిక్ పాలిసీస్ వంటి విభినమైన కోర్సుల కోసం విశ్వ విద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసాధారణమైన మరియు ప్రత్యేకమైన కోర్సులను అందించే తమ నిరంతరాయ కృషిలో భాగంగా ఈ సంవత్సరం తాము దాదాపు 70 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని యాజమాన్యం పేర్కొంది.
వాటిలో కొన్ని (బిబిఏ – పబ్లిక్ పాలిసీ గవర్నెస్, ఎమ్.పి.పి – మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ పాలిసీ, ఎమ్.బి.ఏ ఇన్ పబ్లిక్ పాలిసీ అండ్ మేనేజ్ మెంట్) లను మా విశ్వవిద్యాలయం అందిస్తోంది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యకు సంబంధించిన దాదాపుగా అన్ని రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు కొనసాగిస్తూ విద్యార్థులు ‘పరిశ్రమ సంసిద్ధులు’గా అయ్యేందుకు కృషి చేస్తుంది. కొత్త ఆలోచనల రేకెత్తించడం, విన్నూత్న పరిష్కారాల సృజన, ప్రాథమిక సూత్రాల అన్వయం పై దృష్టి సారిస్తూ, ఈ పరిజ్ఞానం అంతటినీ ఇండస్ట్రీ – యూనివర్సిటీ సెంటర్స్ ని అభివృద్ధిపరిచేందుకు ఉపయోగించేలా శ్రధ్ధ తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో మా పరిశ్రమ భాగస్వాములతో ఎంతో సన్నిహితంగా కలిసి పని చేస్తామని… వారి బ్రాండ్ లకు విలువ తేవడమే తమ లక్ష్యమని పేర్కొంది యాజమాన్యం. మొత్తంగా సామాజిక పురోభివృద్ధికి విన్నూత్నమైన పరిష్కారాలను కనుగొనడమే తమ విస్తృత లక్ష్యమని యాజమాన్యం వెల్లడించింది.
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ప్రస్తుతం అందిస్తోన్న కోర్సులు :
స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్
బి.టెక్ ప్రొగ్రామ్స్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (స్పెషలైజేషన్ ఇన్)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
డేటా సైన్స్
సైబర్ సెక్యూరిటీ
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎమ్.టెక్ ప్రొగ్రామ్స్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
క్లౌడ్ కంప్యూటింగ్
సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్
బిగ్ డేటా ఎనలిటిక్స్
విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్
పి.హెచ్.డి ప్రొగ్రామ్స్
స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్
బి.ఎస్సీ ప్రోగ్రామ్స్
బి.ఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
బి.ఎస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్
బి.ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ
బి.ఎస్సీ (ఆనర్స్) ఫుడ్ సైన్స్
ఎమ్.ఎస్సీ ప్రోగ్రామ్స్
ఎమ్.ఎస్సీ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్
ఎమ్.ఎస్సీ అగ్రోనమీ
ఎమ్.ఎస్సీ ఎంటమాలజీ
ఎమ్.ఎస్సీ ప్లాంట్ పాథాలజీ
ఎమ్.ఎస్సీ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్
ఎమ్.ఎస్సీ హార్టీకల్చర్
ఎమ్.ఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
పి.హెచ్.డి ప్రొగ్రామ్స్
స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ / కామర్స్
బిబిఏ ప్రోగ్రామ్స్
బిబిఏ-బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
బిబిఏ – లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్
బిబిఏ – అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్
బిబిఏ – ఏవియేషన్ అండ్ టూరిజం మేనేజ్ మెంట్
బిబిఏ – బిజినెస్ ఎనలిటిక్స్
బిబిఏ – బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
బిబిఏ – బాచిలర్ ఆఫ్ బిజినెస్ ఆంత్రప్రన్యూర్షిప్
బి.హెచ్.ఎమ్. సి.టి – బాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ
బి.కాం – కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అంకౌంటింగ్
బి.కాం – ఈవెంట్ మేనేజ్ మెంట్, అడ్వర్టయిజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్
బి.కాం. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ జి.ఎస్.టి
బి.కాం – ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
ఎమ్.బి.ఏ ప్రోగ్రామ్స్
ఎమ్.బి.ఏ – అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్
ఎమ్.బి.ఏ – హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్
ఎమ్.బి.ఏ – లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్ మెంట్
ఎమ్.బి.ఏ – బిజినెస్ ఎనలిటిక్స్
ఎగ్జిక్యూటివ్ ఎమ్.బి.ఏ
పి.హెచ్ డి ప్రోగ్రామ్స్
పబ్లిక్ పాలిసీ కోర్సులు
బిబిఏ – పబ్లిక్ పాలిసీ అండ్ గవర్నెస్
బి.ఏ. – హెచ్.ఇ.పి (హిస్టరీ, పొలిటికల్ సైన్స్)
బి.ఏ – హెచ్.పి.జి (హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ)
ఎం.పి.పి – మాస్టర్ ఆప్ పబ్లిక్ పాలిసీ
ఎమ్.బి.ఏ – పబ్లిక్ పాలిసీ అండ్ మేనేజ్ మెంట్
స్కూల్ ఆఫ్ సైన్సెస్
మెడికల్ సైన్స్
బి.ఎస్సీ (ఆనర్స్) – ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
బి.ఎస్సీ (ఆనర్స్) – కార్డియో వాస్కులర్ టెక్నాలజీ
బి.ఎస్సీ (ఆనర్స్) – ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ
బి.ఎస్సీ – డయాలిసిస్ టెక్నాలజీ
బి.ఎస్సీ – రెస్పిరేటరీ థెరపీ
బి.ఎస్సీ – డెంటల్ టెక్నాలజీ
పారామెడికల్ సైన్సెస్
బి.ఎస్సీ – మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
బి.ఎస్సీ – ఆప్టోమీట్రీ
బి.ఎస్సీ – రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ
బి.ఎస్సీ – హెల్త్ సైకాలజీ
బి.ఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్స్
బి.ఎస్సీ – కంప్యూటర్ సైన్స్
ఎమ్.ఎస్సీ ప్రోగ్రామ్స్
ఎమ్.ఎస్సీ- హెల్త్ సైకాలజీ
ఎమ్.ఎస్సీ- క్లినికల్ రిసెర్చ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ మెడిసిన్
ఫిజియోథెరపీ కోర్సులు
బి.పి.టి – బాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
ఎమ్.పి.టి – మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ
వెటర్నరీ సైన్స్
బి.ఎస్సీ – వెటర్నరీ సైన్స్ అండ్ ఆనిమల్ హస్బాండరీ
ఫిషరీస్ సైన్స్
బి.ఎస్సీ – బాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్
స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్
కోవిడ్ – 19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య
గత విద్యా సంవత్సరం 2020-21 లో 1200 మందికి పైగా భిన్న కేటగిరీలకు చెందిన విద్యార్థులకు రూ.2,00,000 లకు వరకు, మొత్తం కోర్సుకు గాను స్కాలర్ షిప్స్ పొందారు.
