Site icon NTV Telugu

Malla Reddy V/s IT : మల్లారెడ్డి, ఐటీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు!

Mallareddy..it

Mallareddy..it

Malla Reddy V/s IT : ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారనిఆరోపణపై ఐటీ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో రెండు రోజుల ఐటీ సోదాలు చేపట్టింది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో పత్రాలు చూసి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై దాడి చేసి, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదులో తెలిపారు. తమ దగ్గర దొరకని వసూలు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదులో మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి, ఐటీ అధికారులు చేసిన ఫిర్యాదులను అధికారులు దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇటు ఐటీ.. అటు మంత్రి మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు దుండిగల్‌ కి ట్రాన్స్ఫర్‌ చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదుతో ఈకేసు పోలీసులకు ఈకేసు తలనొప్పిగా మారింది.

Read also: YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు

మల్లారెడ్డి ఇద్దరు కొడుకులతో 100 కోట్ల డొనేషన్లపై ఐటీ సంతకాలు పెట్టిచ్చేందుకు ప్రయత్నించింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాలలో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని ఐటి మహేందర్ రెడ్డితో సంతకం పెట్టించింది. మెడికల్ కాలేజీలో విద్యార్థుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని భద్రారెడ్డితో సంతకం పెట్టించే ఐటీ ప్రయత్నం చేసింది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాదన దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే లావాదేవులో ప్రతిదానికి లెక్కలు ఉంటాయని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజుల ఐటీ హైడ్రాలమతో నిన్న అర్ధరాత్రితో ఐటీ సోదాలు ముగిసాయి.
YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల మార్పు

Exit mobile version