Site icon NTV Telugu

Mallareddy fire on IT: మల్లారెడ్డి ఫైర్.. దొరికింది గోరంత, ఐటీ డప్పు కొండంత

Mallareddy Sunilla

Mallareddy Sunilla

Mallareddy fire on IT: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిన్న అర్థరాత్రితో ముగిసాయి. అయితే ఐటీ హై డ్రామాతో తన బంధువుల ఇంట్లో సోదాలు ముగియడంతో మంత్రి మల్లారెడ్డి పైర్‌ అయ్యారు. దొరికింది గోరంత అయితే ఐటీ డప్పు మాత్రం కొండంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నా పెద్ద కొడుకు దగ్గర 16 లక్షల దొరికాయి, చిన్నోడి దగ్గర 4 లక్షలు దొరికాయియని, అంతకుమించి అదనంగా రూపాయి దొరకలేదు కానీ రిపోర్ట్‌లో 8 కోట్లు దొరికినట్టు రాశారని మండిపడ్డారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లారెడ్డి ఐటీ అధికారిని వెంటతీసుకెళ్లి పోలీసులకు మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. బోయిన్‌పల్లి పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. దొంగతనంగా నా కుమారులతో సంతకం చేయించారని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు చర్యనా? అంటూ ప్రశ్నించారు. మేము నిజాయితీగా, పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తున్నామన్నారు. అడ్డగోలుగా బ్లాక్ మనీ ఉందని, డొనేషన్స్ ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాసి సంతకం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లారెడ్డి.

Reada also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఆ సినిమాకి ముహూర్తం ఫిక్స్?

నా కుమారుడు అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నాడని, మా ముందు అతడితో సంతకం చేయించుకుంటామన్నారని అన్నారు. చిన్న కుమారుడితోనూ సంతకం చేయిస్తామన్నరని తెలిపారు. నాకు తెలియకుండానే సంతకం చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఏం రాశారో చూపించకుండానే సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. రిపోర్ట్‌లో ఏం రాశారో చూపించమని కోరుతున్నామని డిమాండ్‌ చేశారు. లేనివి ఉన్నట్టు రాశారని.. ఇంత మోసం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే.. మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్‌ పీఎస్‌లో ఐటీ అధికారుల ఫిర్యాదు చేశారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లరెడ్డి పై ఫిర్యాదు ఐటి అధికారులు చేశారు. 342 353 201 203 504 506 353 379 r/w 34 ipc సెక్షన్ కింద కేస్ నమోదు చేశారు. ఐటి సోదలో సేకరించిన డాకుమెంట్స్, పంచనామా, సెల్ ఫోన్స్, లాప్ టాప్స్ లను మంత్రి మల్లరెడ్డి లాకున్నట్లు పేర్కొన్నారు. డ్యూటీలో అధికారి విధులకు ఆటంకంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక, ఐటీ అధికారులు మల్లారెడ్డిని టార్గెట్ చేశారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడ్డారు. ఐటీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారులకు మేము సంపూర్ణంగా సహకరిస్తున్నామని, కానీ వాళ్లు మాత్రం రిపోర్ట్‌లో ఏం రాశారో చూపించకుండానే సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. వీళ్లు దొంగలా, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌లా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. సంతకం తీసుకోవడానికి అంత అర్జంట్ ఏముంది? అంటూ ప్రశ్నించారు.
Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్

Exit mobile version