NTV Telugu Site icon

Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి

Chamakura Mall Areddy

Chamakura Mall Areddy

Malla Reddy: మాట వరుసకు మాట్లాడిన మాటను పట్టుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్‌ అయ్యారు. బోడుప్పల్‌ లో నేను ఈటల రాజేందర్‌ ఎదురుపడ్డామని తెలిపారు. నేనే ఈటల వద్దకు వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన, కౌగిలించుకున్నా.. అన్న నువ్వ గెలుస్తున్నావ్‌’ అని ఈటలతో మట్లాడినా అందుకు నా మాటలు పట్టుకుని ట్రోల్‌ చేస్తున్నారి ఫైర్‌ అయ్యారు. వాళ్లకు ఫ్రెండ్‌ షిప్‌ తెలియదు, ష్పోర్టీ తెలియదు ఒక మెండి మనషులు, ఒక రౌడీ లెక్క అన్నారు. ఎలక్షన్స్‌ అంటే మాటలు మాట్లాడుకోవడం సహజం అన్నారు. కానీ ఎప్పటికైనా స్నేహం స్నేహమే అన్నారు. ఒకప్పుడు నేను ఎంపీగా, తెలుగు దేశం తరుపున ఈటల ఎమ్మెల్యేగా నిబడ్డారు. అప్పుడు నాకు ఈటల ఎదురు పడినప్పుడు అన్నా నువ్వు గెలుస్తున్నావ్‌ అన్నాను.

Read also: High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

నేను అలా అన్నందుకు ఈటల గెలిచిండా? లేదుకదా అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ తరుపున ఎంపీ ఈటల నిలబడ్డాడు. నాకు ఎదురుపడ్డాడు నేనే తన వద్దకు వెళ్లి అన్నా గెలుస్తా అన్నాను.. అప్పుడు అయ్యిందే ఇప్పుడు అయితది అంతే అంటూ మల్లన్న వ్యాఖ్యనించారు. అప్పట్లో నేను గెలిచినా ఈటల ఓడిపోయిండు. మరి దానికి ఏం చెప్పాలి అని ప్రశ్నించారు మల్లారెడ్డి. అలా మాట వరుసకు మట్లాడిన మాటలను పట్టుకుని ట్రోల్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎదుటివారికి స్పూర్తినివ్వాలి నిరాస పరచకూడదు. పుట్టినరోజు వేడుకల్లో ఎదుటివారు మనకు విరోధి అయినా మనకు ఎదురు పడితే ఆశీర్వదించాలని ఉదాహరణ చెప్పుకొచ్చారు. అయినా ఎదుటి వ్యక్తిని నువ్వు ఓడిపోతావు అని ఎలా చెప్తాము. నేను అన్న మాటలు స్టేటస్‌ లో పెట్టుకుని ఏమైనా ట్రోల్‌ చేస్తున్నారా అంటూ ఫైర్‌ అయ్యారు.
BRS KTR: దురదృష్టవశాత్తు ఓడిపోయాం.. మళ్ళీ అధికారంలోకి వస్తాం..