NTV Telugu Site icon

Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?

Meghadoot Water Air In Secendrabad

Meghadoot Water Air In Secendrabad

Secunderabad Railway Station: ప్రపంచ వ్యాప్తంగా మంచి నీటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడ చూసినా నీటి కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో వేసవి కాలం కావడంతో మంచి నీటి కోసం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అతి తక్కువ ధరకు మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది.

అంటే.. గాలిలోని తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఇటీవల ప్రతి ఒక్కరూ ఈ కొత్త విధానం గురించి వినే ఉంటారు. అయితే, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వాతావరణ నీటి జనరేటర్ కియోస్క్‌ను ఏర్పాటు చేసింది. ‘మేఘదూత్’ అని పిలువబడే ఈ వాతావరణ నీటి జనరేటర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ మైత్రి ఆక్వాటెక్ భారతదేశంలో అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వాటర్‌ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.

Read also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ

తాగునీరు దొరక్క పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మైత్రి ఆక్వాటెక్ కంపెనీ ఎండీ ఎం.రామకృష్ణ మేఘదూత్ కు అందుబాటులోకి తేవాలని ఆలోచించారు. ఈ క్రమంలో.. మేఘదూత్ వాటర్ జనరేటర్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మేఘదూత్ పోర్టబుల్ అట్మాస్ఫియరిక్ వాటర్ జెనరేటర్ అనేది ప్రీమియం-నాణ్యత గల తాగునీటి పరికరం. అయితే AWG, అట్మాస్ఫియరిక్ వాటర్ హార్వెస్టర్ అనేది గాలిలోని తేమ నుండి త్రాగునీటిని ఉత్పత్తి చేయడానికి డీయుమిడిఫికేషన్ సూత్రాన్ని ఉపయోగించే పరికరం.

కంటికి కనిపించని గాలిలో తేలుతున్న సస్పెండ్ చేయబడిన కణాలను ఫిల్టర్ చేయడానికి యంత్రంలో 1 మైక్రాన్, 12 మైక్రాన్ల రెండు ఫిల్టర్‌లు ఉన్నాయి. ఇందులో 1 లీటరు నీటిని ఉత్పత్తి చేయడానికి.. కేవలం 0.3 యూనిట్ల శక్తి మాత్రమే అవసరం అవతుంది. అయితే ఈ నీరు మీరు తాగాలంటే.. రూ. 2 నుంచి రూ. 8 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ బాటిల్‌ను తీసుకువెళితే రూ. 5 చెల్లించాల్సీ ఉంటుంది. కానీ అక్కడున్న బాటిల్ కూడా అవసరమైతే రూ. 8 చెల్లింది నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్‌లో చాలా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన నీటిని అందించే ఈ కొత్త పరికరం నీరు తాగడానికి రైల్వే ప్రయాణికులు ఆశక్తి చూపుతున్నారు.
Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్‌ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన