Secendrabad: సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. సికింద్రాబాద్ క్లబ్ సర్కిల్ సిగ్నల్ వద్ద ఓఎస్ యూవీ కారు వచ్చింది. సిగ్నల్ పడగానే డ్రైవర్ కారును వేగంగా తీసుకువెళ్లేందుకు ముందుకు వెళ్లాడు. అయితే అటువైపు నుంచి వస్తున్న మరో కారు ఎస్‌యూవీని అడ్డుకోవడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో కారు వేగం ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా ముందున్న డివైడర్ ను ఢీ కొట్టింది.. అంతే కాకుండా మూడు సార్లు పల్టీలు కొడుతూ ముందున్న రోడ్డుపై రివర్స్ లో పడింది. అంతే అందులో వున్న వారు గట్టిగా అరుపులతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అక్కడే వున్న ప్రయాణికులు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగులు పెట్టుకుంటూ కారువద్దకు వచ్చారు. కారులో వున్న వారిని బయటకు తీసారు. అయితే అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Janasena: టీటీడీ ఈవోపై సీఐడీకి జనసేన ఫిర్యాదు
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి..వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ట్రాఫిక్ లైట్ పడుతుండటంతో కారు డ్రైవర్ వేగం పెంచడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా ఎడమ వైపు వస్తున్న మరో కారు డ్రైవర్ తప్పేమి లేదని కాగా.. కారు వేగానికి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇందులో కారు డ్రైవర్ దే తప్పని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికైనా వేగంతో వెళ్లడం మంచిది కాదని, సిగ్నల్ ను దాటాలని వేగంతో వెళితే ఇటుంవంటి ప్రమాదాలే చూడాల్సి వస్తుందని, దానితోడు ప్రణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.
Janasena: టీటీడీ ఈవోపై సీఐడీకి జనసేన ఫిర్యాదు