NTV Telugu Site icon

Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Mainampally

Mainampally

బీఆర్ఎస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రిజైన్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కొడుకు రోహిత్‌కు మెదక్ నుంచి టికెట్ ఇవ్వాలని అడిగాడు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

Read Also: AI Images: సోషల్ మీడియాలో హీరోల AI ఇమేజ్ లు చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది..

ఈ పరిణామాలతో రగిలిపోయిన మైనంపల్లి హనుమంతరావు.. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని.. మైనంపల్లి స్థానంలో మల్కాజిగిరిలో మరొకరికి అవకాశం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి జరుగలేదు.. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Read Also: Land For Jobs Case: లాలూ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు..

బీఆర్ఎస్ కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నేడో రేపు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడు.. గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి అతడు ఓడిపోయాడు.

Show comments