Site icon NTV Telugu

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నూతన విద్య ప్రణాళిక పై చర్చ

అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నూతన విద్యాప్రణాళికపై చర్చించనున్నట్టు సునీల్‌ అంబేకర్‌ తెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుంచి 7 వరకు, 2022 భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.ఈ సమావేశాలలో మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంఘం ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా చర్చించనున్నట్టు తెలిపారు. గతేడాది సమావేశంలో ఉపాధి కల్పనపై చర్చించామన్నారు. కోవిడ్ సమయంలో సేవ భారతితో సహా వివిధ సంస్థలు చేసిన సేవా కార్యక్రమాలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. విద్య రంగంలో జరుగుతున్న కార్యక్రమాలు వాటి పై చర్చిండంతో పాటు, ఏబీవీపీ, శిక్షణమండలి వారు చేపట్టిన కార్యక్రమాలను చర్చిస్తామన్నారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. వర్తమాన పరిస్థితులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న విషయాలను సంస్థలకు చెందిన ప్రతినిధులు వివరిస్తారన్నారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సామరస్యత వంటి అంశాల్లో సమన్వయంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా చర్చ జరగనుందన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అందరూ 2 డోసులు టీకా తీసుకున్నారని అంబేకర్‌ వెల్లడించారు.

Exit mobile version