Site icon NTV Telugu

Mahmood Ali: ప్రతీరోజూ ఉమెన్స్ డే.. మహిళల్ని గౌరవిద్దాం

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇవాళ SHO గా నియామకం అయిన మధులతకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్ డే నే…మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం. విదేశాల్లో అలా ఉండదు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకం… వారి సంఖ్య కూడా పెరిగింది..

అన్నీ పీ. యస్ లలో మహిళా సిబ్బంది కి అన్నీ వసతులు కల్పిస్తున్నాం. వాష్ రూమ్స్, ఫీడ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ కట్టిస్తున్నాం. మహిళలు అన్ని రంగాలలో పైకి రావాలి. సీఎం కేసీఆర్ ఏ పథకంలో అయిన మొదటి ప్రాధాన్యం మహిళలకే ఇస్తున్నారు. తెలంగాణ పోలీస్ ఇండియాలోనే నెంబర్ వన్ గా వుంది. తెలంగాణ ప్రజలకు పోలీస్ మీద నమ్మకం భరోసా ఉంది అంటే వాళ్ళ పని తీరుకు నిదర్శనం. మన దగ్గర నెంబర్ వన్ లా అండ్ ఆర్డర్ ఉంది.

షీ టీమ్స్, భరోసా సెంటర్స్, మహిళల భద్రత కోసం అద్భుతంగా పని చేస్తున్నాయి. లేడీ ఆఫీసర్స్ అద్భుతంగా పని చేస్తున్నారు. మహిళలు రక్షణ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. రోజు మహిళలను గౌరవిస్తే, ప్రతీ రోజు ఉమెన్స్ డే నే అవుతుంది. అన్ని రంగాలలో మగవారితో సమానంగా మహిళలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డైనమిక్ సీఎం దొరకడం మన అదృష్టం.. గాడ్ గిఫ్ట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళా రక్షణ, అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైమ్ మహిళను SHO గా నియమించడం సిటీ పోలీస్ శాఖలో శుభ పరిణామం. హైదరాబాద్ లో అన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి, సిటీ పోలీస్ పని తీరు వల్ల అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.పోలీస్ శాఖ కు హై టెక్నాలజీ వాహనాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎవరు డయల్ 100 కు కాల్ చేసినా, వెంటనే పోలీసులు వస్తున్నారు.

https://ntvtelugu.com/hyderabad-cp-cv-anand-particpate-womens-day-celebrations/
Exit mobile version