Site icon NTV Telugu

Mahmood Ali : బోయగూడ ఘటన దురదృష్ణకరం..

ఈరోజు బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారని, ఈ ప్రమాదం పై పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాముల పని చేస్తున్నారు అనే వివరాలు సేకరించాలని అదేశించామన ఆయన వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరామని,
ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాముల ను గుర్తించాలని సూచించామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా చూడాలని కోరామని, కూలీలకు వసతి యజమానులు కల్పించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని, రేపు ఉదయం మృతదేహాలను తమ స్వస్థలానికి తరలిస్తామని ఆయన వెల్లడించారు. నగరంలో ఉన్న గోదాములను గుర్తించి నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Exit mobile version