ఈరోజు బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారని, ఈ ప్రమాదం పై పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాముల పని చేస్తున్నారు అనే వివరాలు సేకరించాలని అదేశించామన ఆయన వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరామని,ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాముల ను గుర్తించాలని సూచించామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో…
సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్‌నోట్‌లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్…