Site icon NTV Telugu

CM Revanth Reddy: ప్రతి టౌన్‌లో ‘మహిళా మార్ట్’లు ఏర్పాటు కావాలి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే విధంగా ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మార్ట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించడంతో, వ్యాపారం చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకాశాలు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వ సంకల్పం… అధికారుల కార్యచరణ… ఆడబిడ్డల ఆచరణకు… ప్రతిరూపం ఖమ్మంలో…దిగ్విజయంగా నడుస్తోన్న… ఈ ‘మహిళామార్ట్’. ఇందులో భాగస్వాములైన…ప్రతి ఒక్కరికి నా అభినందనలు. రాష్ట్రంలో… ప్రతి టౌన్ లో ఇటువంటి ‘మహిళా మార్ట్’ లు ఏర్పాటు కావాలి ఆకాంక్షిస్తున్నా.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మహిళా మార్ట్ ద్వారా మహిళలకు ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు లభిస్తున్నాయి. ఈ మోడల్‌ను ఇతర పట్టణాలకు విస్తరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు

Exit mobile version