NTV Telugu Site icon

Mahesh kumar Goud: మంత్రి ఉత్తమ్ ప్రెసెంటేషన్ తో హరీష్ దిమ్మతిరిగింది

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh kumar Goud: మంత్రి ఉత్తమ్ ప్రసెంటిషన్ తో హరీష్ రావు దిమ్మతిరిగి పోయిందని ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన అంటే ఏంటో 70 రోజుల పాలన చూస్తే అర్థం అవుతుందన్నారు. పదేళ్లు కార్పొరేట్ పాలన లభించిందన్నారు. మంత్రులు శాఖల వారీగా సమీక్ష చేస్తుంటే అవినీతి బయటకొస్తుందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ ప్రసెంటిషన్ తో హరీష్ దిమ్మతిరిగి పోయిందని తెలిపారు. లక్ష 25 వేళా కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు చేశారన్నారు. మేడిగడ్డ బీటలు భారిందన్నారు. మేము కట్టిన ప్రాజెక్టు లు చిన్న పగుళ్లు కూడా రాలేదు 70 రోజుల్లో 30 వేళా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ దోపిడీ బయట పెడితే… కేసీఆర్ అబద్ధపు మాటలు మట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు ఉంటాయన్నారు. విద్యా, వైద్యరంగం మెరుగుపర్చడం కోసం ఓ కమిషన్ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

Read also: Telangana High Court: సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదు.. మాజీ OSD హరికృష్ణకు హైకోర్టులో ఊరట

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మేము మాట్లాడుతుంటే ఇంకో సభ్యులకు అనుమతి ఇవ్వకండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన విషయాలు బుక్ లో పొందుపరిచారు అని పేర్కొన్నారు. ఆయకట్టు రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు.. వాస్తవం మాత్రం ఇంకోలా. ఇక, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కి ముందు అంటే నిజాంకి ముందు ఆ తర్వాత అని చెప్పారు. ఇక, నిజాం అప్పటి నుంచి నిధులు ఖర్చు పెట్టారా?.. రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారు అంటూ హరీశ్ రావు అన్నారు.. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ అనేక సందర్భాల్లో నీటి వాటాపై చర్చించారు.. కేంద్రం నుంచి లేఖ వచ్చింది అపెక్స్‌లో పాల్గొనండి అని అన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్తే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది.. మీటింగ్ కి పోకుండా టెండర్ అయిపోయే వరకూ చూశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు రీకౌంటర్ ఇచ్చారు.. వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ ఇది అంటూ. ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం చేశారు.. సభలో కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగిస్తామన్నారు.
Rohit Sharma: రెండు రోజుల ముందే వెళ్తాం.. అప్పుడు మేం చేసేదేముంటుంది?: రోహిత్ శర్మ