NTV Telugu Site icon

Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయం..

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ కి నిర్ణయం తీసుకున్న విషయం చారిత్రక నిర్ణయమని తెలిపారు. ఇంతటి ఘనత సాధించి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వ పనితీరు ను మనం విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని తెలిపారు.

Read also: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

2004 లో కరీంనగర్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అడ్డంకులు వచ్చినా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసామన్నారు. అలాగే 2022 డిసెంబర్ లో ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు రైతులకు ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇకపోతే మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ చేస్తమని ప్రకటించారన్నారు.

Read also: ఇన్‌స్టాలో అవి చూస్తే రిస్క్‌లో పడ్డట్టే..?

ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇంతటి ఘనత సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మనం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలన్నారు. ఈ రోజు, రేపు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ అమలు సందర్భంగా సంబరాలు, ప్రెస్ మీట్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో రైతులకు అనేక మాటలు చెప్పి మోసం చేసిందని గుర్తు చేశారు.

Read also: Cell Phone Snatching: చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై పోలీసులు ఫైర్‌..!

ఈ విషయంలో ఈ రోజు అన్ని నియోజక వర్గాలలో, జిల్లా కేంద్రాలలో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్గానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ తో మాట్లాడగలరని విజ్ఞప్తి చేశారు. ఇవాళ.. రేపు సంబరాలకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. ఒకేసారి రెండు లక్షల రుణమాఫీకి కేబినెట్ ఆమోదంపై సంబరాలు చేసుకోవాలని తెలిపారు. మండల..జిల్లా కేంద్రాల్లో సంబరాలు చేయాలని డీసీసీ లకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలకు వివరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Wrong Route Driving: రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నారా తస్మాత్‌ జాగ్రత్తా..