CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..
- తెలంగాణ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..
- ఇవాళ మహబూబ్ నగర్ లో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే స్వయంగా తెలంగాణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా చేస్తున్నట్టు తెలిపారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి హాస్టల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రిని సొంతం చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా నిర్మించిన ఆసుపత్రిలో 600లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని మంత్రి దామోదర తెలిపారు.
PV Sindhu: మరోసారి పతాకధారిగా పీవీ సింధు!
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!