NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో రోజులు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. అందులో భాగంగానే స్వయంగా తెలంగాణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను తానే స్వయంగా చేస్తున్నట్టు తెలిపారు.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి హాస్టల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రిని సొంతం చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా నిర్మించిన ఆసుపత్రిలో 600లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని మంత్రి దామోదర తెలిపారు.
PV Sindhu: మరోసారి పతాకధారిగా పీవీ సింధు!