MLA Laxmareddy: తగ్గని జోరు అదే హుషారు.. లక్ష్మారెడ్డి సమక్షంలో భారీ చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. గడప.. గడపకు తిరుగుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రచారంలో లక్ష్మారెడ్డి జోరు తగ్గడం లేదు అదే హుషారుతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఖానాపూర్ గ్రామపరిధిలోని సోమ నాయక్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో భారీగా చేరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 15మంది సోమ నాయక్ తండా వాసులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాకప్పి ఘనంగా ఆహ్వానించారు లక్ష్మారెడ్డి. కార్యకర్తల హుషారు, నిరంతర చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అంటూ జెండాలన్నీ పక్కనపెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
ఖానాపూర్ గ్రామ పరిధి సోమ నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ మంజు నాయక్, తరుణ్, తులసిరామ్, హన్యతో సహా పలువురు 15 మందికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త నాయకుడు గత 9 ఏండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలకు తెలపాలని కోరారు. ఇక రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచర వర్గం 20 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికల తరువాత మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని.. పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.
IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..