NTV Telugu Site icon

Weird Director: సినిమా డైరెక్టర్ కావాలన్నదే లక్ష్యం.. 90కి పైగా దొంగతనాలు..

Cinema Diroctor

Cinema Diroctor

Weird Director: సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ ఎలా? దేనికైనా సరే పైసలు అవసరం. అయితే డబ్బులు కావాలంటే కష్టపడాలి అలా చేయడానికి బద్దకం. అందుకే ఓ ప్లాన్ వేశాడు ప్రబుద్ధుడు. దొంగతనం చేసి సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడ్. అంతేకాదు దొంగతం చేయడానికి ఓ టైం కూడా సెట్ చేసుకున్నాడు. ఆ సమయం తగ్గట్టుగానే దొంగతనాలు చేస్తూ షార్ట్ ఫిలిం కూడా నటించాడు. అంతటితో ఆగలేదు సినిమా డైరెక్టర్ కావాని అనుకున్నాడు. కానీ దానికి లక్షలు, కోట్లల్లో డబ్బులు కావాలి. రోజూ తను ఫిక్స్ చేసుకున్న టైంకు దొంగతనం చేస్తూ జల్సాలకు ఖర్చు వాడుకునే వాడు. అంతా బాగానే నడుస్తున్న టైం లో.. దొంగతనం బయటకు రానే వచ్చింది. చివరకు ఆ జల్సా రాయుడు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటలో చోటుచేసుకుంది.

Read also: MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపండి.. బీఆర్‌ఎస్‌ పై జీవన్‌ రెడ్డి ఫైర్‌

అప్పల నాయుడు అనే వ్యక్తి శ్రీకాకుళంకు చెందిన వాడు. సినిమా డైరెక్టర్ కావాలన్నదే అప్పలనాయుడు లక్ష్యం. లవ్ అండ్ క్రైమ్ పేరుతో అప్పలనాయుడు ఓ షార్ట్ ఫిలిం కూడా తీయడమే కాదు అందులో నటించాడు కూడా. అయితే సినిమా డైరెక్టర్ కావాలనే ఆశ, జల్సాలు చేయాలనేది లక్ష్యంతో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు దొంగతనాలకు పాల్పడుతూ జల్సా చేసేవాడు. ఇంట్లో ఉన్న వస్తువులనే ఆయుధంగా అప్పలనాయుడు వాడేవాడు. దొంగతనానికి వెళ్లిన ఇంటిలో విలువైన వస్తువులను తీసుకుని దానిని అమ్మి జల్సాలు చేసేవాడు. దోచుకున్న సొమ్మంతా హైదరాబాద్, రాయచూర్ లో జల్సాలకు ఖర్చుపెట్టే వాడు. అయితే.. కొందరు బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పలనాయుడు భాగోతం వెలుగులోకి వచ్చింది.

Read also: CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..

నారాయణ పేట పోలీసులు అప్పలనాయుడు అదుపులో తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అప్పలనాయుడు 90కి పైగా దొంగతనాలు చేసినట్లు విని ఆశ్చర్యపోయారు. బతువుతెరువు కోసం శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్ నారాయపేటకు అప్పలనాయుడు వచ్చాడని తెలిపాడు. సినిమా డైరెక్టర్ కావాలన్నదే అప్పలనాయుడు లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడు. లవ్ అండ్ క్రైమ్ పేరుతో షార్ట్ ఫిలిం తీసి అప్పలనాయుడు నటించినట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలో ఆరు కేసులకు సంబందించి 75 తులాల బంగారం, 35 తులాల వెండి, 4 లక్షల నగదు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Komatireddy Venkat Reddy: హాట్‌ కామెంట్.. కేసీఆర్ స్థానంలో నేనుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని..