Revnath Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలోని కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్నారు. రూ.110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మెట్ల మార్గంలో కాంచన గుహలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామిని సీఎం దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ,జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సీఎం రాకతో మహబూబ్ నగర్ లో పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రహదారులను దారిని మళ్లించారు. వాహనదారులు వేరే మార్గాల నుంచి వెళ్లాలని సూచించారు. పోలీసులకు వాహనదారులు సహకరించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు ట్రాఫిక్ నియంత్రణలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీ పేలుడు..
Revnath Reddy: నేడు మహబూబ్ నగర్ కు సీఎం.. రూ.110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన
- నేడు మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- రూ.110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి..
Show comments