NTV Telugu Site icon

Rajanna Sircilla: మహారాష్ట్ర ముఠా నిర్వాకం.. కూలీలను పంపించలేదని తల్లి కిడ్నాప్

Kidnap

Kidnap

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి లక్ష రూపాయులు అడ్వాన్స్ తీసుకున్నాడు. తీరా కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: SS Rajamouli: ఏళ్ళ నుంచి ఫోన్లో వాల్ పేపర్.. రాజమౌళి కాళ్లపై పడ్డ నిర్మాత

కిడ్నాప్ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి ఒడిశా నుంచి కూలి పనిచేయడానికి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వచ్చారు. మహారాష్ట్ర చెందిన లాలూ దివాకర్ అనే వ్యక్తి.. శ్రీనివాస్ ఇంటికి వచ్చి కూలీలు కావాలని అడగ్గా అందుకు దాదాపు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. శ్రీనివాస్ ఎంతకు మనుషులను పంపించకపోవడంతో లాలూ దివాకర్ ఎనిమిది మందితో వచ్చి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో శ్రీనివాస్ తల్లిని బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం నిందితులను అరెస్టు చేసి.. కిడ్నాప్ అయిన మహిళను ఇంటికి చేర్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.

ఇది కూడా చదవండి: చీకటిలో మెరిసే జంతువులను చూశారా..

Show comments