NTV Telugu Site icon

BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై

Mlc Kavitha Tweet

Mlc Kavitha Tweet

BRS Party: మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్‌ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని సాగర్ అన్నారు. ఇటీవల నాందేడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నదే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సాగర్ అనే అభిమాని చేసిన ట్విట్ కు ఎమ్మెల్సీ కవిత ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.

అయితే… కవిత ఈ నెల 25న ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట జరిగే సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొంటారు. 2024 ఎన్నికలు-ప్రతిపక్ష వ్యూహం అనే అంశంపై జరిగే చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. ఈ సదస్సులో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ పాల్గొనున్నారని సమాచారం.