NTV Telugu Site icon

Teachers Mlc Election: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, బరిలో 21 మంది

Mlc

Mlc

Teachers Mlc Election: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 29,720 మంది ఓటర్లకు గాను 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 126 ప్రధాన పోలింగ్ కేంద్రాలు, 11 అదనపు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 29,720 మంది ఓటర్లలో 15,472 మంది పురుషులు, 14,246 మంది మహిళలు, 2 మంది ఇతరులు ఉన్నారు.

మొత్తం 137 పోలింగ్‌ కేంద్రాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15, నాగర్‌కర్నూల్‌లో 14, వనపర్తిలో 7, జోగులాంబ గద్వాల్‌లో 11, నారాయణ పేట్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్‌ కేంద్రాలు, వికారాబాద్‌లో 18 పోలింగ్‌ కేంద్రాలు, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరిలో 14 పోలింగ్‌ కేంద్రాలు, హైదరాబాద్‌ జిల్లాలో 22 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని 739 మంది పోలింగ్ అధికారులు నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137 మంది పీఓలు, 137 మంది పీపీఓలు, 319 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 593 మందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్‌లో ఉన్నారు. 29 మంది పీఓలు, 30 మంది ఏపీఓలు, 87 మంది పోలింగ్ సిబ్బంది రిజర్వ్‌లో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టార్ కంట్రోల్ అధికారులను నియమించారు. ఈ నెల 13న పోలింగ్‌ నేపథ్యంలో మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు వైన్‌ షాపులను మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

21 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. జిల్లాల వారీగా, ఉపాధ్యాయ సంఘాలు ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి మరీ గెలిపించాలని అభ్యర్థించారు. నిజానికి ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 16న సరూర్‌నగర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ ఉంటుంది.
Mlc Kavitha: కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ