NTV Telugu Site icon

Mahabubnagar MLC Bypoll: మహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌.. బీఆర్ఎస్ విజయం..

Mahaboobnagar

Mahaboobnagar

Mahabubnagar MLC Bypoll: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, ఒక టేబుల్‌పై 237 ఓట్లు లెక్కించారు. ప్రధాన అభ్యర్థులుగా మన్నె జీవన్ రెడ్డి (కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్ (స్వతంత్ర) పోటీ చేస్తున్నారు. 108 లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాగా.. కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది. పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1,416 కాగా.. బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652, స్వతంత్ర అభ్యర్థి 1 సాధించారు.

Read also: Bike Thieves: పార్కింగ్‌ వాహనాలే టార్గెట్‌.. మాస్టర్‌ కీ సాయంతో దొంగతనం

ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 1,439 మంది ఓటర్లు ఉండగా, 1,437 మంది ఓటు వేశారు. మార్చి 28న ఉప ఎన్నిక జరగ్గా, ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన కారణంగా నేడు కౌంటింగ్ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ మరికొద్ది గంటల్లో ముగియనుంది.
Train Accident : రెండు గూడ్స్ రెళ్లు ఢీ.. ఇంజిన్ బోల్తా, ఒకదానిపైకి ఒకటి ఎక్కిన బోగీలు