Site icon NTV Telugu

బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి…

తెలంగాణ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలి. ధరల పెరుగుదల పై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయండి అని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ అన్నారు. రాజకీయంగా ఎదగడానికి పనిచేస్తుంది. కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నాడు. రాజకీయ లబ్ధికోసమే దళిత బంధువు.. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. దళితలకు 3ఎకరాల భూమి ఏమైంది. దళిత బంధు కాదు.. బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి. బీజేపీ మతతత్వ పార్టీ… వచ్చే ఎన్నికల్లో చేతి దెబ్బకు కారు, పువ్వు పల్టీకొట్టాల్సిందే. యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల్లో , అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీట్లు వచ్చేలా చూస్తాం. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి. దానికోసం అందరు కష్టపడి పనిచేయాలి అని పేర్కొన్నారు.

Exit mobile version