ఎర్రబెల్లి, గంగుల, తలసాని, దానం లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన చేరారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అలాంటి వాళ్ళను కేసీఆర్‌ను పోగుడతున్నరని, 8 ఏండ్లుకు నోటిఫికేషన్లు నిన్న వచ్చాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంకు అప్పులు… కేసీఆర్ గొప్పలు.. జనంకు తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని, 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని, ఉద్యమ పార్టీకి ఎక్కడి నుండి వచ్చాయి ఇన్ని కోట్ల ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల గుండెళ్ళో గులాబీ మల్లు గుచ్చుకుందని, ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఎక్కడో ఉందని ఆయన అన్నారు. శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకున్న హోం మంత్రి సబితా కేసీఆర్ పక్కన కూర్చుందని, ముక్కోణపు పోటీ సృష్టించి గెలవాలని టీఆర్‌ఎస్ చూస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుట్రలు జనం పసిగట్టండని ఆయన అన్నారు.