NTV Telugu Site icon

Madhu Goud Yaskhi: కేసీఆర్ బీజేపీకి బీ-టీమ్‌గా పని చేస్తున్నారు

Madhu Yaskhi Goud

Madhu Yaskhi Goud

Madhu Goud Yaskhi Said KCR Working As B Team For BJP: కేసీఆర్ బీజేపీకి బీ-టీమ్‌గా పని చేస్తున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా ఆ రెండు పార్టీలను వేర్వేరుగా చూడాల్సిన పని లేదని పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతుంటే.. కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా సమావేశం జరుగుతుంటే.. బీఆర్ఎస్ వాళ్లు మాత్రం అమిత్ షాతో భేటీ అవుతున్నారని చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ తెరవెనుక ముద్దులు పెట్టుకుంటూ.. తెరముందు మాత్రం గుద్దుకుంటున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్‌లో కవిత పేరు ఉన్నప్పటికీ.. ఆమెని అరెస్ట్ చేయకుండా, మిగతా వాళ్లను అరెస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేసీఆర్ తన పార్టీలో తెలంగాణ పదమే తొలగించేశారని, కేటీఆర్ పేరుని ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఐఏఎస్‌లకు కనీసం పోస్టింగులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

Minister RK Roja: హాయ్‌ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!

ఇక వైఎస్ షర్మిల్ తమ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిదేనని, షర్మిల కుటుంబమే కాంగ్రెస్ కుటుంబమని మధుయాష్కీ అన్నారు. కాంగ్రెస్‌కి వాళ్ళు దూరం అయ్యారు కానీ.. కాంగ్రెస్ వదులుకోలేదని తెలిపారు. పొంగులేటి చేరిక తమకు లాభమేనని పేర్కొన్నారు. పార్టీలోకి కాంట్రాక్ట్‌ల కోసమో.. పార్టీ కోసం వస్తున్నారో అనే విషయాల్ని తేల్చుకోవాలంటూ పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని విమర్శించారు. పార్టీ స్థానిక నాయకులకు అన్యాయం జరగకుండా చూడాలని, దీనిపై చర్చ జరగాలని అన్నారు. బీసీలకూ ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పార్టీ అధికారంలోకి రావడం సులభమని అభిప్రాయపడ్డారు. కొత్తగా పార్టీలోకి వస్తే.. పార్టీ గెలుస్తుందనుకుంటే పొరపాటే అవుతుందని చెప్పారు. కర్ణాటకలో మాజీ సీఎంలు వచ్చినా.. బీజేపీ వాళ్లు ఓడిపోయారన్నారు.

Hyderabad Hijab Row: హైదరాబాద్ స్కూల్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థినిని ఇంటికి పంపిన యాజమాన్యం