Madhapur Zone Police Arrested Chain Snatching Batch: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు.. బైక్ వేసుకుని వెళ్లి, మెడలో ఉండే గొలుసులు లాగేసుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటుపడిన యువత.. ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేవలం నగరంలో ఉండే వాళ్లు కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువత సైతం గొలుసు దొంగలించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ గొలుసు దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఓ ముఠాని మాదాపూర్ జోన్ పోలిసులు పట్టుకున్నారు. చోరీ చేసిన బైక్‌లతో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉండగా.. 8 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.
Harish Rao: ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో హరీశ్ రావు మీటింగ్.. కొన్ని కీలక నిర్ణయాలు
ఈ కేసు గురించి మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. జులై 13వ తేదీన చందానగర్, మియాపూర్ పీయస్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు జరిగాయన్నారు. అదే సమయంలో ఆర్సీపురం పీఎస్ పరిధిలోనూ ఒక ఒక బైక్ చోరీకి గురైందన్నారు. ఆ చోరీ చేసిన బైక్‌తోనే చందానగర్, మియాపూర్, సంగారెడ్డిలో స్నాచింగ్‌లకు పాల్పడ్డారన్నారు. ఆ బైక్ ఆధారంగా తాము విచారణ చేపట్టి.. నలుగుర్ని అరెస్ట్ చేశామన్నారు. ఈ ముఠా సభ్యులు ముంబైకి చెందినవారని, వీరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. A1 అమ్జద్ ఇక్బాల్ షేక్ ముంబైకి చెందినవాడని, అతడు 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అన్నారు. A2 షౌకత్ హుస్సేన్ ఖాన్ సైదాబాద్‌లో పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని.. అలాగే A3 తన్వీర్ ఖాన్ ఆ ఇద్దరితో కలిసి గతంలో చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. ఇక A4 విజయ్ కమలాకాంత్ యాదవ్ రిసీవర్ అని.. ఆ ముగ్గురు చోరీకి పాల్పడితే, ఇతను రిసీవ్ చేసుకుంటాడని వివరించారు.
Health Tips: రోజూ పొద్దున్నే దీన్ని తింటే.. 60 ఏళ్లు వచ్చినా వయస్సు ఎంతో కనిపెట్టలేరు..!
జులై 13వ తేదీన ఉదయం11:30 గంటల సమయంలో ఆర్సీ పురంలో బైక్ చోరీ అయ్యిందని.. మద్యాహ్నం 12 గంటలకు మియాపూర్‌లో స్నాచింగ్‌కి పాల్పడ్డారని డీసీపీ వెల్లడించారు. ఆ వెంటనే 1 గంటకి చందానగర్‌లో, అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేశారని అన్నారు. రాత్రి 7:30 గంటలప్పుడు మరోసారి మియాపూర్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడినట్లుగా ఆమె తెలిపారు. తాము ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని.. నిందితుల ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశామని డీసీపీ చెప్పుకొచ్చారు.